-: కవిత :- 
------------------------------------------------------------------------------------------------------------------------

  నాగరికత ... !


వరండాలోకొచ్చిబయటకు చూశాను
బావురుమంది.. నాహృదయం
ఎదురుగా బోసిపోయిన దృశ్యం
నిన్నటిదాకా .. కళ్ళెదుట
పచ్చగా కొమ్మరెమ్మలతో..
గుబురుగా.. నిండుగా .. కనిపించే.
సజీవ దృశ్యం అదృశ్యమైంది
యెన్నో యేళ్ళుగా.. జీవం పోసుకొని
ఇంతింతగా ఎదిగి
అంతెత్తయిన వట వృక్షం
నిర్ధాక్షిణ్యంగా .. నేలకొరిగింది … !
పెరుగుతున్న నాగరికత కోసం
  రహదారిని పెంచే ప్రక్రియకు
ఆకాశమంత ఎత్తు ఎదిగి
ఎన్నో పక్షులకు ఆలవాలమైన
ఆ వటవృక్షం అడ్డంకి ... !
ఎన్నో పక్షులకు ఆలవాలమైన
రహదారుల విస్తరణ
నాగరికతకు అవసరమే....
పెరుగుతున్న జనాభాకు
చాలినంత వసతి అవసరమే ..!
మరి.. వృక్ష నాశనం...? *** 
----------------------------------------------------------------

      రచన :-  కైపు ఆదిశేషా రెడ్డి 
         ఈ కవితపై మీ అభిప్రాయాలు  యివ్వగలరు  

Comments

Popular posts from this blog

తొందర పాటు..!

రాజ కుమారినే పెళ్ళాడుతా...!

లాభించిన కల