Posts

Showing posts from December, 2008

ఉత్తమ చెట్టు

Image
పినాకిని నదీ తీర ప్రాంతం లోని ఒక రైతు పొలం లో ఒక మామిడి చెట్టు , ఒక వేప చెట్టు పక్క పక్కన మొలిచాయి . వాటిని గమనించిన పొలం యజమాని మామిడి చెట్టుకు పాదు చేసి , మంచి ఎరువు వేసి నీళ్లు పెట్టేవాడు. వేప చెట్టును గురించి పట్టించుకోలేదు. తానూ గొప్పది కాబట్టి రైతు తన పట్ల శ్రద్ద చూపుతున్నాడనే భావం మామిడిలో కలిగింది. కాసింత అహంకారం కూడా పెరిగింది. కాలక్రమం లో రెండు చెట్లు పెరిగి పెద్దవయ్యాయి. పూలు పూచి , కాయలు కాసాయి. మామిడి పండ్లు మధురంగా వుండగా వేప పండ్లు చేదుగా వున్నాయి . ప్రతి ఒక్కరూ తన మధుర ఫలాలని ఇష్టపడి తింటూ వుండటం తో మామిడికి మరింత గర్వం పెరిగి వేపతో మాట్లాడటం మానివేసింది . అది గమనించిన వేప '' మామిడిగారూ ..! ఏమిటి ఇటీవల నాతొ మునుప టిలా వుండటం లేదు ..? '' అని అడిగింది . '' నాకూ .. నీకు ఏమి పోలిక . మధుర రసాలను యిచ్చు వృక్షాన్ని నేను. నోట పెట్టుకోను పనికిరాని చెడు ఫలాలు నీవి. నా కంటే తక్కువ దానివి నీతో నాకు స్నేహమేంటి ....? '' గర్వంగా చెప్పి