Posts

Showing posts from March, 2018

వెన్నెముక

Image
  నెల్లూరుకు సమీపంలోని రాజుపాలెం   అనే ఊరిలో రఘురామయ్య అనే రైతు వుండేవాడు . అయనకు యిద్దరు కొడుకులు . పెద్దవాడు ఆనంద్ , చిన్నవాడు రాజేష్ . యిద్దరినీ బాగా చది వించాలని , వారిద్దరు తనలాగా కాయ కష్టం చేయగూడదని మంచి స్కూల్లో చేర్పించాడు .                పెద్దవాడికి   చదువు బాగా అబ్బింది . చిన్నవాడికి చదువులో పట్టు దొరకలేదు . ఆనంద్ శ్రద్ధగా చదివి ఇంజనీరింగ్ లో పట్టా పొందాడు . పట్నంలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు . అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరుకున్నాడు .       రాజేష్ కి చదువు వంటబట్ట లేదు . ఎంతగా   బ్రతిమాలి   చెప్పినా తండ్రి మాటలు పెడ చెవిన బెట్టి స్కూలుకు   నామం   పెట్టి      తోటలమ్మట , పొలాలమ్మట   తిరిగి   చదువుకు   దూరమయ్యాడు .      చివరకు తండ్రికి   తోడుగా వ్యవసాయదారుడిగా మిగిలిపోయాడు .                ఆనంద్ ఉద్యోగంలో మంచి   స్థాయిలోకి వచ్చి , బాగా సంపాదించాడు . అయితే అతని ఉద్యోగానికి   ఒక సమయమంటూ లేదు . ఒక్కోసారి   రాత్రంతా పని చేయాల్సివచ్చేది . ఆ సమయంలో సరైన   వేళకి నిద్ర, ఆహారం ఉండేది కాదు . కానీ ఆ కష్టాన