'' తాతయ్యా ..!తాతయ్యా..!'' అం టూ పిల్ల నక్క పరు గెట్టుకొచ్చింది, తాత నక్క దగ్గరకు. '' ఏంట్రా... చిన్నోడా..ఆ హడావుడి...'' పిల్ల నక్కను పక్కన కూర్చోబెట్టుకుని అడిగింది తాత నక్క. ''తాతయ్యా..! నిన్న నేనూ నా ఫ్రెండ్స్ కలసి అలా షికారు కెళ్ళాం . అక్కడ ఒక ద్రాక్ష తోట విరగ పండి వుంది తాతయ్యా..! గుత్తులు గుత్తులుగా ద్రాక్ష వేలాడుతూ వుంది. దాన్ని చూడగానే నోరుఉరిందంటే నమ్ము....! '' అంది. '' నిజమే..! ద్రాక్ష గుత్తులు చూస్తుంటే ..ఎవరికైనా నొరూరు తుంది. '' అంది తాత నక్క గతాన్ని గుర్తు కు తెచ్చు కుం టూ. ''నాకూ నోరూ రింది తాతయ్యా..! కానీ ఆ ఎర్ర నక్కొడు, పీసు నక్కొడు, తొర్ర నక్కొడు ద్రాక్ష పుల్లగా వుంటుందని...వాళ...