Posts

Showing posts from October, 2014

అందిన ద్రాక్ష

Image
'' తాతయ్యా ..!తాతయ్యా..!'' అం టూ  పిల్ల  నక్క  పరు గెట్టుకొచ్చింది, తాత నక్క దగ్గరకు. '' ఏంట్రా... చిన్నోడా..ఆ హడావుడి...'' పిల్ల నక్కను పక్కన కూర్చోబెట్టుకుని అడిగింది తాత నక్క. ''తాతయ్యా..! నిన్న నేనూ నా ఫ్రెండ్స్ కలసి అలా షికారు కెళ్ళాం . అక్కడ ఒక ద్రాక్ష తోట విరగ పండి వుంది తాతయ్యా..! గుత్తులు గుత్తులుగా ద్రాక్ష వేలాడుతూ వుంది. దాన్ని చూడగానే నోరుఉరిందంటే నమ్ము....! '' అంది. '' నిజమే..! ద్రాక్ష గుత్తులు చూస్తుంటే ..ఎవరికైనా నొరూరు తుంది. '' అంది తాత నక్క గతాన్ని  గుర్తు కు   తెచ్చు  కుం టూ. ''నాకూ నోరూ రింది తాతయ్యా..! కానీ ఆ ఎర్ర నక్కొడు, పీసు నక్కొడు, తొర్ర నక్కొడు ద్రాక్ష పుల్లగా వుంటుందని...వాళ...
Image
  -: కవిత :-  ------------------------------------------------------------------------------------------------------------------------   నాగరికత ... ! వరండాలోకొచ్చి … బయటకు చూశాను బావురుమంది.. నాహృదయం ఎదురుగా బోసిపోయిన దృశ్యం నిన్నటిదాకా .. కళ్ళెదుట పచ్చగా కొమ్మరెమ్మలతో.. గుబురుగా.. నిండుగా .. కనిపించే. సజీవ దృశ్యం అదృశ్యమైంది యెన్నో యేళ్ళుగా.. జీవం పోసుకొని ఇంతింతగా ఎదిగి అంతెత్తయిన వట వృక్షం నిర్ధాక్షిణ్యంగా .. నేలకొరిగింది … ! పెరుగుతున్న నాగరికత కోసం   రహదారిని పెంచే ప్రక్రియకు ఆకాశమంత ఎత్తు ఎదిగి ఎన్నో పక్షులకు ఆలవాలమైన ఆ వటవృక్షం అడ్డంకి ... ! ఎన్నో పక్షులకు ఆలవాలమైన రహదారుల విస్తరణ నాగరికతకు అవసరమే.... పెరుగుతున్న జనాభాకు చాలినంత వసతి అవసరమే .. ! మరి.. వృక్ష నాశనం...? ***  ----------------------------------------------------------------         రచన :-   కైపు ఆదిశేషా రెడ్డి           ఈ కవితపై మీ...