వెన్నెముక
నెల్లూరుకు సమీపంలోని రాజుపాలెం అనే ఊరిలో రఘురామయ్య అనే రైతు వుండేవాడు . అయనకు యిద్దరు కొడుకులు . పెద్దవాడు ఆనంద్ , చిన్నవాడు రాజేష్ . యిద్దరినీ బాగా చది వించాలని , వారిద్దరు తనలాగా కాయ కష్టం చేయగూడదని మంచి స్కూల్లో చేర్పించాడు . పెద్దవాడికి చదువు బాగా అబ్బింది . చిన్నవాడికి చదువులో పట్టు దొరకలేదు . ఆనంద్ శ్రద్ధగా చదివి ఇంజనీరింగ్ లో పట్టా పొందాడు . పట్నంలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు . అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి చేరుకున్నాడు . రాజేష్ కి చదువు వంటబట్ట లేదు . ఎంతగా బ్రతిమాలి చెప్పినా తండ్రి మాటలు పెడ చెవిన బెట్టి స్కూలుకు నామం పెట్టి తోటలమ్మట , పొలాలమ్మట తిరిగి చదువుకు దూరమయ్యాడు . చివరకు తండ్రికి తోడుగా వ్యవసాయదారుడిగా మిగిలిపోయాడు . ఆనంద్ ఉద్యోగ...