మధుర క్షణం... !
నా చూపులో నీ చూపు కలసిన క్షణం.... సూదంటురాయిలా సాగి మస్తిష్క మందిరాలను చురుక్కున తాకిన ఆ క్షణం.... ఓ మధుర వీక్షణం... ! నా చేతిలో నీ చెయ్యేసి నొక్కిన క్షణం ,,,, తొలి స్పర్శ ప్రవాహంలా సాగి మేనుపర్యంతం తన్మయ ప్రకంపనలిచ్చిన ఆ క్షణం .... ఓ మధుర పరవశం ... ! నా నవ్వుకు నీ నవ్వు జత కలసిన క్షణం.. రస తరంగాలు సాగి యెద పొరల్లో స్వరమాలికలూగిన ఆ క్షణం .... ఓ మధుర సంగీతం ...! క్షణ క్షణం .. నీ తలపుల్లో.. అనుక్షణం.. నీ వలపుల్లో తేలిపోతున్న నాకు ప్రతి క్షణం .... ఓ మరపురాని .. మధుర క్షణం... !