Posts

Showing posts from 2024
Image
 

పరివర్తన

               రాజా రావు మాష్టారు రామాపురం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు . ఒకరోజు ఉదయం మూడో పీరియడ్ ఖాళీగా వుండటంతో , విశ్రాంతి గది లోంచి   వెలుపలకు , వచ్చి వరండాలో నిల్చొని   నలువైపులా తేరిపార   చూస్తున్నంతలో దూరంగా పడి పోయి వున్న ప్రహరీగోడ అవతల యిద్దరు పిల్లలు తచ్చాడుతూ కనిపించారు .         అప్పుడప్పుడూ కొందరు పిల్లలు హోమ్ వర్క్ బారినుండి తప్పించుకునేందుకు క్లాసులు ఎగ్గొట్టి గోడవతల చేరి లాంగ్ బెల్ అయ్యాక లోపలకు రావటం చేస్తూవుంటారు . ఆ పిల్లలు కూడా అలా   వెళ్లుంటారని భావించి నడచుకుంటూ ప్రహరీ వైపు నడిచాడు రాజా రావు మాష్టారు .         గోడ సమీపానికి వెళ్ళగానే .. అటువైపు నుండి సిగరెట్ వాసనతో కూడిన పొగ రావటం కనిపించింది . ఆశ్చర్యపోతున్నంతలో పిల్లల మాటలు వినిపించడంతో ఆగి పోయాడు .         “ ఒరేయ్ రాజూ .. ! నాకు భయం వేస్తుందిరా .. ఏ మాస్టారైనా...