Posts

Showing posts from 2009

రాజ కుమారినే పెళ్ళాడుతా...!

Image
పుల్లయ్యని కాలు కింద పెట్టనిచ్చే వారు కాదు రామయ్య , సీతమ్మ దంపతులు . లేక లేక పుట్టిన కొడుకు మీద ప్రేమ వుండడం సహజమే కాని , మరింత ఎక్కువైతే ఎలా అనుకునేవారు చుట్టూ పక్కల వాళ్లు . " సీతక్కా ...! పుల్లయ్యని మరీ అంత ముద్దు చేయకు . రేపు పెద్దయ్యాక పనీ పాటా రాక పొతే పిల్లనేవరిస్తారు ..! " అని ఓ సారి పక్కింటి రాధమ్మ చనువుగా హెచ్చరిస్తే సీతమ్మ వూరు కోలేదు . " మా వాడి కేం బంగారం . చూ స్తుండు .. వాడికి రాజ కుమారితో పెళ్ళవుతుంది . ." అంది . ఈ మాటలు విన్న పుల్లయ్య " అవును .. నేను లాకుమాలిని పెళ్ళాడుతా .. . " అన్నాడు ముద్దు ముద్దుగా . అప్పటి నుండి బంధువులంతా వాడిని ... " ఒరేయ్ .. ఎవరిని పెళ్లాడుతావురా .. .." అని అడిగి వాడి సమాధానం విని నవ్వుకునే వారు . తల్లి దండ్రుల అతి గారాబం వలన పుల్లయ్యకు పెద్దయినా బరువు భాద్యతలు ఏవీ తెలియ రాలేదు . ఓ సారి సీతమ్మ వాడిని చేరబిలిచి .. " నాయనా ...! నాకు వయసాయి పోయింది ... నీకు పెళ్లి చేయాలను కుంటున్నాను .. " అంది . " మరి...

తొందర పాటు..!

Image
ఒకప్పుడు సింహపురి రాజ్యాన్ని విశ్వనాథుడనే రాజు పాలించే వాడు. ఆయన భార్య శకుంతలా దేవి చాలా కాలానికిగర్భవతి అయింది. తనకు వారసుడు రాబోతున్నాడని రాజు ఎంతో సంబర పడి పోయాడు. కానీ ... ఆమెకు ఒక అండము పుట్టింది. ఇలా ఎందుకు జరిగిందో.. దాని ప్రభావ మెలా వుంటుందోనని భయముతో కంపించిపోయాడు విశ్వనాథుడు. దీని మూలముగా తనకు తన రాజ్యానికి ఏదైనా కీడు జరుగు తుందేమోనని ..... వెంటనే ఈపీడను వదిలించుకొని ....ఆపద నుంచి తప్పించుకోవాలను కొన్నాడు. ఇద్దరు భటులను పిలిచాడు. వారితో.." ఈ అండాన్ని తీసుకెళ్ళి నదిలో పార వేయండి . మహా రాణిని తీసుకెళ్ళి దట్టమైన అడవులలో జంతువులకు ఆహారంగా వదిలి వేయండి . .." అని ఆజ్ఞాపించాడు. అప్పటి వరకు మౌనంగా అంతా చూస్తున్న మంత్రి రాఘవేంద్రుడు జోక్యం చేసుకుని .. " మహారాజా ...! తొందర పడకండి .. అండాన్ని వదిలించు కొవ డములో తప్పు లేదు . కానీ ... ఏ పాప మెరుగని మహారాణికి అంత శిక్ష అవసరమా ...! " అన్నాడు. ' ' మహా మంత్రీ ...! దోష పూరితమైన వాటిని వదిలించు కుంటేనే రాజ్యానికి క్షేమం . ఇందులో నా ఆజ్ణ కి తిరుగు లేదు . వ్యక్తిగత బంధ...