అందిన ద్రాక్ష




'' తాతయ్యా ..!తాతయ్యా..!'' అం టూ  పిల్ల నక్క 
పరుగెట్టుకొచ్చింది, తాత నక్క దగ్గరకు.

'' ఏంట్రా... చిన్నోడా..ఆ హడావుడి...'' పిల్ల నక్కను పక్కన కూర్చోబెట్టుకుని అడిగింది తాత నక్క.

''తాతయ్యా..! నిన్న నేనూ నా ఫ్రెండ్స్ కలసి అలా షికారు కెళ్ళాం . అక్కడ ఒక ద్రాక్ష తోట విరగ పండి వుంది తాతయ్యా..! గుత్తులు గుత్తులుగా ద్రాక్ష వేలాడుతూ వుంది. దాన్ని చూడగానే నోరుఉరిందంటే నమ్ము....! '' అంది.

'' నిజమే..! ద్రాక్ష గుత్తులు చూస్తుంటే ..ఎవరికైనా నొరూరు తుంది. '' అంది తాత నక్క గతాన్ని 
గుర్తుకు తెచ్చు

 కుం టూ.
''నాకూ నోరూ రింది తాతయ్యా..! కానీ ఆ ఎర్ర నక్కొడు, పీసు నక్కొడు, తొర్ర నక్కొడు ద్రాక్ష పుల్లగా వుంటుందని...వాళ్ళ నాన్నలు చెప్పారని చెప్పారు. ఏంటి తాతయ్యా...ద్రాక్ష తియ్యగా వుండదా...? '' అడిగింది పిల్ల నక్క.

తాత నక్కకు ఏమి చెపాలో తోచ లేదు. ద్రాక్ష రుచి తనకూ తెలియదు. ఆ రోజుల్లో ద్రాక్ష తినాలని ఎంతగానో ప్రయత్నించి, వీలుకాక వదిలేసిన సంగతి గుర్తుకొచ్చింది. ఎగిరి

 ఎగిరి .. అందుకోలేక ...వెల్లికిలా పడి, నడ్డి విరగ్గొట్టుకుని వెనక్కి వచ్చేసిన తను. ..., ఆ రోజు నక్కలకి రాజైన తనే
 దానిని అందుకోలేక పోవటం తో , మిగిలిన నక్కలకు...' అందని ద్రాక్ష పుల్లన ' అనే పుల్లటి అబద్దం చెప్పడం 
జరిగింది.

'' ఏంటి తాతయ్యా ..ఆలోచిస్తున్నావ్...? ''

ఆలోచనల నుండి బయటకు వచ్చిన తాత నక్క ..'' దాని రుచి నాకు మాత్రం ఏమి తెలుసురా..చిన్నోడా..! అందరు పుల్లన అంటా వుంటే..నేనూ అలాగే అనుకున్నాను.తింటే గాని రుచి తెలియదు...''

''అయితే నువ్వు కూడా యెప్పుడూ ద్రాక్ష తిన లేదా..? ''

'' ప్రయత్నించాను.... కానీ, కుదర లేదు...''అని, తన అనుభవాన్ని .. ప్లాష్ బ్యాక్ స్టోరీ లాగ పిల్లనక్కతో చెప్పింది.
అది విన్న పిల్ల నక్కకు పట్టుదల పెరిగింది. తన తాత

 సాధించ లేనిది .... తను సాధించాలి..! తన జాతికి అందనిదిగా మిగిలిపోయిన పనిని తాను సాధించి తీరాలి. తన నిర్ణయం తాత తో చెప్పింది.

తాత నక్క నవ్వింది.

''చిన్నోడా..! మన జాతిలో ఎవరూ ఇప్పటిదాకా ద్రాక్ష తిన లేదు. నీకెందు కంత పట్టుదల .... వదిలేయ్..'' అంది.

'' లేడుతాతయ్యా..! ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు. 

ఈ రోజు రాత్రికి నాతొ రా..! సాధించి తీరుతాను...'' 
పట్టుదలగా అన్న పిల్లనక్క మాటలకు బదులు చెప్పలేక '' సరే,,! '' ననిఅంది తాత నక్క.
రాత్రి బాగా పొద్దు పోయాక తాతా మనవాళ్ళు బయలుదేరాయి. ద్రాక్ష తోటను చేరుకున్నాయి. తలెత్తి ద్రాక్ష గుత్తుల వంక చూసాయి. అవి ఎత్తులో వేలాడుతున్నాయి. పిల్ల 

నక్క ఎగిరి అందుకోవాలని రెండు సార్లు ప్రయత్నించి 
విఫల మైంది.

అది తన గత అనుభవమే..! నవ్వుకుంది తాత నక్క. '' వెళదాం రా..రా ..చిన్నోడా..! చెపితే విన్నావు కాదు..''

 విసుక్కొంది.

''తొందరేంటి..తాతయ్యా...! కాసేపాగు . ప్రయత్నించాలి...'' పట్టుదలతో చెప్పింది పిల్ల నక్క.

విధి లేక ఓ చోట కూలబడింది తాతనక్క . ఎలా సాధించాలి... ...అనే ఆలోచనలో పిల్లనక్క ..
పరి పరి విధాలా

 ఆలోచించింది. చుట్టూ పరిశీలించింది. మెదడుకు పదును పెట్టింది.

పిల్లనక్క ఈ తరాని చెందింది. బుద్ధిబలం పెరిగిన తరానికి చెందినది. దాని బుర్రలో ప్లాష్ లా ఓ ఉపాయం ...వెలిగింది.
గబ గబ ఆ వైపు నడిచింది. అక్కడ పెద్ద పెద్ద గంపలు 

వున్నాయి.

పండిన ద్రాక్ష తీసుక వెళ్ళటానికి క్రితం రోజు తోట యజమాని వాటిని తీసుకుని వచ్చాడు. కొన్ని గంపలతో క్రితం రోజు ద్రాక్ష తీసుకెళ్లగా మిగిలిన గంపలను ప్రక్కన పడేసి

 వెళ్ళాడు..

వాటి లోంచి ఒక గంపను లాక్కువచ్చింది పిల్లనక్క.

 గంపను ద్రాక్ష గుత్తుల క్రిందుగా బోర్లించింది.

పిల్లనక్కను తాతనక్క ఆశ్చర్యంగా చూస్తోంది.

బోర్లించిన గంప మీదికి ఎక్కింది పిల్లనక్క. దానికి

 ఇప్పుడు ద్రాక్ష గుత్తులు అందుతున్నాయి.

పిల్లనక్క కళ్ళలో సాధించాననే ఫీలింగ్... ! తాత నక్క కళ్ళలో ఆశ్చర్యం.. ఆనందం ...!!

గబ గబా ద్రాక్ష గుత్తులు కోసింది. కడుపారా తిన్నాయి.

కొంత నోటితో పట్టుకుని అడవి వైపు పరుగు తీసాయి.

తాత నక్క గర్వపడింది....తను సాధించ లేనిది..తన 

మనవడు సాధించాడు...!

'' అందిన ద్రాక్ష పుల్లనా .. తీయనా...!! '.. నక్కల

 నడిగి తెలుసుకుందాం...! (***)
***************************************
( ఇది నేటి తరం పిల్లల ఆలోచనలనూ ,పట్టుదలను దృష్టిలో పెట్టుకి రాసిన కథ. )

  ************************************               ( ఇది' నవ్య ' వీక్లీ లోని బాలల విభాగం' పాలపిట్ట ' లో

 ప్రచురితము. )

                   కైపు ఆది శేషా రెడ్డి .

Comments

Popular posts from this blog

తొందర పాటు..!

ఉత్తమ చెట్టు

వెన్నెముక